
పీడిత శ్రామికుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ప్రజా గాయకుడు
ఈ సందర్భంగా ఎల్ ఎస్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి బానోతు సునీల్ నాయక్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పీడత శ్రామికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన
ప్రజా గాయకుడు విప్లవోద్యమాలకు స్ఫూర్తి సామాజిక ఉద్యమాల లో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ గద్దర్ అనారోగ్యంతో మృతి చెందటం సామాజిక ఉద్యమాలకు ప్రజా కళాకారులకు ప్రజా ఉద్యమాలకు తీరని లోటు దశాబ్దాల తరబడి బూర్జవాబుస్వామ్య పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన విప్లవకారుడు గద్దర్ అని వారు అన్నారు
ఎల్ ఎస్ పి ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు అజ్మీరవెంకట్ మాట్లాడుతూ గద్దర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు ఉద్యోగ పనిచేసి సామాజిక ఉద్యమాలలో మరియు విప్లవోద్యమంలో దీర్ఘకాలం పని చేశారని తన ఆటపాటతో విప్లవ గీతాలు ఆలపించేవాడని అనేక మంది యువతను ఆకర్షించి విప్లవోద్యమంలో పయనింప చేశాడని ఆ తర్వాత కాలంలో సామాజిక అభ్యుదయ ఉద్యమాల వైపు వచ్చారని అనేక అభ్యుదయ సినిమాలలో గొప్ప పాటలు రచించారని తన విప్లవ పాటలు ప్రజలను ఎంతో ఉత్తేజపరిచేయని అన్నారు కామ్రేడ్ గద్దర్ మరణించడం ప్రజాస్వామ్య వాదులకు సమాజానికి తీరని లోటని వారి కుటుంబానికి తీరనిలోటని కామ్రేడ్ గద్దర్ కి విప్లవ జోహార్ అర్పిస్తూ వారి కుటుంబానికి ఎల్ హెచ్ పి ఎస్ తరఫున సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోహార్లు అర్పించిన వారిలో భూక్య రవి బోడ ప్రకాష్ బాదావత్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు