
ప్రభుత్వ పాఠశాలలోకి మీడియా, విద్యార్థి సంఘాలకు అనుమతి లేదు
ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన గారు ఇచ్చిన ఆదేశాలలో ప్రభుత్వ ప్రాథమిక,ఉన్నత, కేజీవీపీ, గురుకుల పాఠశాలలలోకి మీడియను అదేవిధంగా విద్యార్థిసంఘాలను అనుమతించొద్దని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని PDSU జిల్లా కోశాధికారి గణేష్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వ పాఠశాలలోకీ మీడియాను, విద్యార్థిసంఘాలను ఆయా విద్యాసంస్థలలోకి రానివ్విద్దని ఆదేశాలివ్వడం ప్రజాస్వామ్య హక్కులను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడమే అనీ, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థిసంఘాలు, మీడియా వ్యవస్థ వెలికి తిస్తున్నాయని అలా చేయడం వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున నిషేధం విధించారాని, విద్యరంగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థిసంఘాలను ప్రభుత్వ పాఠశాలలోకి రానివ్వకపోవడం వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ కుట్ర ఉందని వరన్నారు.రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, అలాగే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన గారు పాఠశాలల్లోకి మీడియాను, విద్యార్థిసంఘాలను రావొద్దని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోకుంటే రాబోయే రోజుల్లో PDSU సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని వారన్నారు.