హసన్ పర్తి: మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్ డిమాండ్ చేశారు.
గురువారం హసన్పర్తి లోని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రినీ సందర్శించి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
పి హెచ్ సి నుంచి సివిల్ హాస్పిటల్ గా ప్రతిపాదనలు పొందిన, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, రెండు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి,స్వీపర్సు లేకపోవడం వల్ల హాస్పిటల్లో ఎక్కడ దుమ్ము చెత్త అక్కడే ఉందని, వాచ్మెన్ లేకపోవడంతో రక్షణ లేకుండా పోయిందని, నీటి సమస్య ఉందని టాయిలెట్స్ పరిశుభ్రంగా లేవని, 24 గ్రామాల్లో 8 ప్రాథమిక హెల్త్ సెంటర్ల ఉంటే అందులో పర్మినెంట్ వైద్యులు లేరని, గతంలో ఇరువై పడకలు ఉంటే ఇప్పుడు భవనం శిథిలావస్థలో ఉండటం వల్ల సేవలు ఆగిపోయినాయి, ప్రభుత్వం స్పందించి హాస్పటల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ హసన్ పర్తి మండల అధ్యక్షులు కుర్ర హర్ష, కార్యదర్శి వేలు సుమన్ నాయకులు లోకిని రమేష్, గొల్లపల్లి మౌనిక, పోతరాజు కర్ణ పాల్గొన్నారు.