ఈనెల 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.వీరాంజనేయులు పిలుపునిచ్చారు.నార్పల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ మహాత్మ గాంధీ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, పార్టీ నాయకులతో కలసి వీరాంజనేయులు పాల్గొన్నారు.మన ఊరికి మన వీరా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సిపి శ్రేణులు కార్యకర్తలు తరలివచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. నాటి పాలకులు నార్పల కూతలేరు బ్రిడ్జిని పూర్తి చేస్తామని మాటలు చెప్పి కాలయాపన చేస్తే ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూతలేరు బ్రిడ్జిని పూర్తిచేసి నార్పల ప్రజల కలను నిజం చేశారన్నారు. మండలంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. నాయన పల్లి బొందలవాడ, బొందలవాడ గూగూడు రోడ్లు ఇంతకుముందు చాలా అధ్వానంగా ఉండేవి. అవి కూడా ఈ ఐదేళ్లలో వేయించామన్నారు.ఈ ఎన్నికల్లో పొరపాటున మీరు తప్పు నిర్ణయం తీసుకుంటే రైతు భరోసా కేంద్రాలు పోతాయి. రైతు భరోసా పోతుంది

ఎప్పటిలాగే సబ్సిడీల కోసం, విత్తనాల కోసం, ఎరువుల కోసం క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకోండి. ఎండకు మాడి తిండి తిప్పలు లేక రోజుల తరబడి వీటన్నింటి కోసం ఎదురు చూశారు.జగనన్న వచ్చాక మనకు అందుబాటులో రైతు భరోసా కేంద్రాలు తెచ్చారన్నారు. ఇవన్నీ మళ్లీ కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటే సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.