బసవ పున్నయ్యపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ లో నెలకొన్న పరిణామాలపై,ఫెడరేషన్ అడహాక్ కమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ డా.బండి విజయ్ కుమార్ సీపీఎం (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్టు) రాష్ట్ర నాయకులను కలిసి వినతి పత్రం సమర్పించారు.బసవ పున్నయ్యపై తక్షణమే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు పార్టీ నేతలను కోరారు.మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,పొలిట్ బ్యూరో సభ్యులు తమ్మినేని వీరభద్రం,రాష్ట్ర కమిటీ నాయకులు కిల్లె గోపాల్,జిల్లా కార్యదర్శి ఏ.రాములులను బండి విజయ్ కుమార్,ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి మొలకల పల్లి గోపాల్ మహారాజ్,నాయకులు విష్ణు కలిశారు.ప్రధాన ఆరోపణలు
ఫెడరేషన్ లో బసవ పున్నయ్య కారణంగా అనేక విచ్ఛిన్న పరిస్థితులు నెలకొన్నాయని,ఆయన స్వంత నియంతృత్వ పోకడలు,పెడదోరణలు పెరిగిపోయాయని బండి విజయ్ కుమార్ సీపీఎం నాయకులకు వివరించారు.తనను ఎవరూ ఏమీ చేయలేరని,’నేనే బాస్’అనే ధోరణితో స్వార్థం పెరిగి సంఘంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.ఆయన వ్యవహారశైలిని మార్చుకోవాలని పలుమార్లు తెలిపినా మారలేదని నాయకులు గుర్తు చేశారు.సీపీఎం స్పందన
ఫెడరేషన్ నాయకుల ఆరోపణలను సావధానంగా విన్న సీపీఎం నేతలు,ఈ పరిణామాలపై పార్టీ స్థాయిలో తప్పకుండా చర్చించి,తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పలువురు ఇతర జర్నలిస్టులు కూడా సీపీఎం నాయకులను కలిశారు.