
telugu galam news e69news local news daily news today news telugu galam news e69news local news daily news today news
సిపిఎం జిల్లా కార్యదర్శి, అన్నవరపు కనకయ్య
కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ విలువలను ఖూనీ చేస్తూ,ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, బిజెపి యేతర రాష్ట్రాలను నిర్వీర్యం చేసే విధానాలను నిరసిస్తూ స్థానిక మంచికంటి భవన్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఢిల్లీలో కేరళ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావంగా ప్రదర్శన నిర్వహించారు, బస్టాండ్ సెంటర్లో ఏర్పాటుచేసిన సభా నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలోని బిజెపి యేతర రాష్ట్రాల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని, రాష్ట్రాల హక్కులను లాగేసుకొని స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, రాష్ట్రాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని అన్నారు. భారత రాజ్యాంగ విలువలను ఖూనీ చేస్తూ, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ, రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా ఇవ్వట్లేదని, గవర్నర్ ను ప్రయోగించి రాష్ట్ర పరిపాలన వ్యవస్థను దెబ్బతీస్తున్నారని అన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా, కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో రాష్ట్రాల అధికారాలు, విధులను అతిక్రమించే చట్టాలను రూపొందిస్తోందనీ, రాష్ట్ర శాంతిభద్రతలపై కూడా చట్టాలు చేస్తున్నారని అన్నారు. తమని ఎన్నికల్లో స్వాగతించని కేరళ,తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లో, అనేక అంశాల్లో తీవ్ర పక్షపాతం చూపుతోందని,తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజే రమేష్, లిక్కి బాలరాజు, కె. బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ,రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, పార్టీ కొత్తగూడెం పట్టణ నాయకులు జునుమాల నగేష్ ప్రజాసంఘాల నాయకులు డి.వీరన్న,వీరభద్రం,లక్ష్మీ,గండమళ్ళ భాస్కర్,అభిమన్యు , నాగకృష్ణ,రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.