
బీసీ రిజర్వేషన్ల కోసం బంద్ విజయవంతం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌ను విజయవంతం చేయాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఐలోని సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నంబర్ 9ను హైకోర్టు కొట్టి వేసిందని గుర్తుచేశారు.ఈ నేపథ్యంలో,బీసీ సంఘాల ఐక్యవేదిక రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లను చేర్చాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చిందని తెలిపారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు,ప్రజా సంఘాలు,కుల సంఘాలు ఈ బంద్‌కు మద్దతు తెలపాలని కోరారు.న్యాయబద్ధమైన ఈ డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని బీసీలకు రాజ్యాంగబద్ధమైన 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సుధాకర్ గౌడ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర శాసనసభ ఇప్పటికే ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్,కేంద్రం పట్టించుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు.బీసీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాజకీయాలకు అతీతంగా మేధావులు,యువకులు,విద్యార్థులు,ప్రజా సంఘాలు అందరూ కలసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.