
హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయంలో విజయదశమి (దసరా) పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారు నిజ రూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు.పండుగ శుభావసరంగా నవకలశ స్నపనం,సుగంధ పరిమళ ద్రవ్యములతో విశేష అభిషేకం,నవశక్త్యార్చన,శమిపూజ,ఆయుధపూజ (వాహనపూజలు),త్రిశూల స్నానం,సామ్రాజ్య పట్టాభిషేకం,నీరాజన మంత్రపుష్పార్చన,తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ వేడుకల్లో ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్,ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,ఐనవోలు మధుకర్ శర్మ,వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి,అర్చకులు నందనం భానుప్రసాద్,మధు శర్మ, శ్రీనివాస్,నరేష్ శర్మ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్యదర్శనం పొందారు.దేవాలయ కార్యనిర్వహణాధికారి కందుల సుధాకర్ ఈ వివరాలు తెలియజేశారు.