రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నాయిని
RTC పరిరక్షణ కోసం హన్మకొండ సుందరయ్య భవన్ CPI పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ..
RTC ప్రజా రవాణ వ్యవస్థను కాపాడాలి, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు మొత్తం విడుదల చేయాలి.
RTC కార్మికులకు ప్రభుత్వం రాయితి లు ఇవ్వాలి.
ప్రభుత్వం ఇవ్వాల్సిన మొత్తాలను విడుదల చేయాలి.
కార్మికులపై పని ఒత్తిడి తగ్గించాలి.
RTC కార్మిక భద్రత కొనసాగించాలీ.
RTC డ్రైవర్ కండక్టర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
RTC లో గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే జరపాలి.
RTC వేతన సవరణలు అమలు చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో RTC ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, సిపిఐ నాయకులు కర్రే బిక్షపతి, టిడిపి నాయకులు శ్యాం సుందర్, బిసి నాయకులు కృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు అప్పారావు, INTUC నాయకులు కూర వెంకట్, RTC నాయకులు బి.ఎన్. చారి, ఎల్లయ్య, ఏ. రాజేందర్, సుధాకర్, మధుకర్, రాజేందర్, మురళి రఘుపతి, పల్లె రాహుల్ రెడ్డి, పల్లకొండ సతీష్ తదితరులు పాల్గొన్నారు.