
వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాదపుజోత్సవం
శుక్రవారం రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదపూజ అనే కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు నిత్యం పిల్లల యోగక్షేమాల కోసమే పరితపిస్తారని, తల్లిదండ్రులను మించిన దైవం లేదని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవ తరగతి ఫలితాలలో అత్యంత ప్రతిభను ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలకు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, రాజు, బిక్షపతి, దేవేందర్, రవీందర్, ఐలయ్య, సుమన్, చైతన్య, మాలత, రాధిక, శిరోమణి, అబీదా విద్యార్థులు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు.