గోషామహల్ లో పోస్టర్ ఆవిష్కరించిన సీటు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
ఫాసిజం పై ఎర్ర సైన్యం విజయం స్ఫూర్తితో మే 20 సమ్మె ను జయప్రదం చేద్దాం

ఫాసిజం పై ఎర్ర సైన్యం విజయం స్ఫూర్తితో మే 20 సమ్మె ను జయప్రదం చేద్దాం

- సీటు నేత ఎల్ కోటయ్య గోషామహల్ లో పోస్టర్ ఆవిష్కరించిన సి ఐ టి యు ---- ---- ---- ----- ప్రపంచం లో నా జాతే గొప్పదని జాత్యహంకారం తో అప్పటి సోషలిస్ట్ రష్యా పై 2 వ ప్రపంచ యుద్ధానికి (1945 ) దిగిన నియంతృత్వ హిట్లర్ సైన్యాన్ని రష్యా ఎర్ర సైన్యం తరిమికొట్టిందని, లక్షలాది రష్యన్ ప్రజలు, ఆ దేశ సైన్యం చూపిన సాహసం తో మే 9 వతేదీనీ ఫాసిజం ఎర్ర సైన్యం సాధించిన విజయం చరిత్రలో లిఖించబడిందని,ఆస…
- – సీటు నేత ఎల్ కోటయ్య
- గోషామహల్ లో పోస్టర్ ఆవిష్కరించిన సి ఐ టి యు
- —- —- —- —–
- ప్రపంచం లో నా జాతే గొప్పదని జాత్యహంకారం తో అప్పటి సోషలిస్ట్ రష్యా పై 2 వ ప్రపంచ యుద్ధానికి (1945 ) దిగిన నియంతృత్వ హిట్లర్ సైన్యాన్ని రష్యా ఎర్ర సైన్యం తరిమికొట్టిందని, లక్షలాది రష్యన్ ప్రజలు, ఆ దేశ సైన్యం చూపిన సాహసం తో మే 9 వతేదీనీ ఫాసిజం ఎర్ర సైన్యం సాధించిన విజయం చరిత్రలో లిఖించబడిందని,ఆస్పూర్తి తో హక్కుల రక్షణకు నడుం బిగించాలని సీటు ( సి ఐ టి యు) అనుబంధ ట్రాన్స్పోర్ట్ రంగ హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎల్ కోటయ్య పిలుపునిచ్చారు. నేడు గోషామహల్ జోన్ కమిటి ఆధ్వర్యంలో అఫ్జల్ గంజి ఆటో స్టాండ్ డ్రైవర్లతో కలిసి సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు.
- పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరనకు గాను కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగివచ్చేలా మే 20 వ తేదీన జరగనున్న జాతీయ సమ్మె లో రవాణా రంగం లోని కార్మికులు అంతా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
- గోషామహల్ ట్రాన్స్పోర్ట్ రంగం ( సి ఐ టి యు ) ఆధ్వర్యంలో సిఐటియు ట్రాన్స్పోర్ట్ కమిటీగా ఫాసిజం మీద.ఎర్ర సైన్యం సాధించిన విజయం రోజును ( మే 9 వ తేదీ) పురస్కరించుకొని ఈరోజు ఉదయం ఉస్మానియా దవాఖాన పాతమెయిన్ గేటు ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోషామహల్ ట్రాన్స్పోర్ట్ రంగం ( సి ఐ టి యు) అధ్యక్షులు సత్యనారాయణ సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం జిల్లా కార్యదర్శి ఎల్ కోటయ్యలు పాల్గొని ప్రసంగించారు వారు మాట్లాడుతూ ఎర్ర సైన్యం చూపిన పట్టుదలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతం లోని రవాణా రంగ కార్మికుల్లో విస్తృతంగా సమ్మె ప్రచారం చేయాలని అన్నారు.
- ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు ఖాజా మోయిముద్దీన్,రాజా,బషీర్ తదితర ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు