రాహుల్ బర్త్‌డేను సేవతో జరిపిన యూత్ కాంగ్రెస్
ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదినోత్సవాన్ని పర్వతగిరి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పలకలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల అనిల్, మండల అధ్యక్షుడు గొడుగు వినయ్ మాట్లాడుతూ.. “ఇందిరమ్మ ఆశయ సారథి, రాజీవ్ కలల వారధి రాహుల్ గాంధీ కాబోయే భారత ప్రధాని” అని పేర్కొన్నారు. భారత ఐక్యత కోసం ఆదర్శవంతమైన నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారని కొనియాడారు.
ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అంకితభావంతో పని చేస్తున్న నాయకుడని, అణగారిన వర్గాల గొంతుకగా నవభారత నిర్మాణం కోసం ఆయన చేస్తున్న పోరాటం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు మూడు దేవరాజ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నరుకుడు రవీందర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎర్రబోయిన సాంబరాజు యాదవ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కత్తుల శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.