చదువే భవిష్యత్తుకు బాట: ఎమ్మెల్యే రాగమయి
విద్యార్థులు కష్టపడి, ఇష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ‘బడి బాట’ కార్యక్రమంలో బుధవారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ విద్యే భవిష్యత్తుకు పునాది అని, రేపటి జీవితం ఈనాటి చదువుపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు.
విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువు, ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని చెప్పారు. గురువులు, తల్లిదండ్రులు, సమాజాన్ని గౌరవించే సంస్కారం ప్రతి విద్యార్థిలో ఉండాలని హితవు పలికారు.ఈ
కార్యక్రమంలో: మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ)చల్లంచర్ల వెంకటేశ్వరరావు, కందుకూరు ఇన్చార్జి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ చైర్మన్, ఏఎంసీ వైస్‌చైర్మన్ వెంకటప్పరెడ్డి, సొసైటీ చైర్మన్ గొర్ల సంజీవ్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, భరణిపాడు సహకార సంఘం మాజీ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు (నాని), కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, మహిళా,యువజన నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.