
ఈ69న్యూస్ వరంగల్, మే 05
వరంగల్ నగరంలో రేపు (బుధవారం) నిర్వహించనున్న రైతు సంగ్రామ సభలో పాల్గొనడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి Kalvakuntla Taraka Rama Rao (కేటీఆర్) ఈ రోజు వరంగల్‌కు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.పూలమాలలు, నినాదాలతో కార్యకర్తలు ప్రాంతాన్ని సందడి చేశారు.కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.బుధవారం జరిగే రైతు సంగ్రామ సభకు వేలాదిగా రైతులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశమున్నందున సభ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్కింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ సభలో కేటీఆర్ రైతుల సమస్యలు, పంటల ధరలు, రుణమాఫీ, సాగునీటి అంశాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలపై విస్తృతంగా మాట్లాడనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ వైఖరిని వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఇక సభ విజయవంతం కోసం స్థానిక నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రైతులను భారీగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభ బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.