రైస్ మిల్లు ధాన్యం నిల్వ కేంద్రం కప్పు పోయే
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల భీమవరం గ్రామంలో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.ప్రకృతి విలయ తాండవం చేసింది.సుమారుగా రెండొందల కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో భారీ వర్షంతో గ్రామంలో భీభత్సం జరిగింది.మహా వృక్షాలు కొన్ని నేలకొరిగాయి.విద్యుత్ స్తంభాలు విరిగాయి.చీకటిలో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది.ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇంత జరుగుతున్న గ్రామాన్ని అధికారులెవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు తెలుగు గళం ప్రతినిధికి చరవాణి లో ఆవేదన వ్యక్త చేశారు.పేదప్రజల ఆకలి తీర్చే దానికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని మిల్లు ద్వారా ఆడి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చే కోట్ల రూపాయల విలువ గల దేవిక మోడ్రన్ రైస్ మిల్లు ఈ ప్రమాదంలో చిక్కుకుంది.కోట్ల రూపాయల ఖర్చు పెట్టీ మిల్లు పక్కనే ధాన్యం నిల్వ చేసే దానికి ఏర్పాటు చేసిన గోడౌన్ కు అమర్చిన హై గ్రేడ్ క్వాలిటీ కు చెందిన రేకులు సుమారు మూడు కిలోమీటర్ల దూరం వరకు లేచి పోయాయి. అనగా గ్రామ శివారులో గల తుంబురు గ్రామం వెళ్ళే రహదారి వరకు కొట్టుకుపోయాయి.దీంతో మిల్లు యాజమాన్యం లోన్స్ తీసుకొని వ్యాపారం చేస్తున్నామని తీవ్రమైన నష్టం వాటిల్లిందని తెలుగుగళం తెలుగు జాతీయ దినపత్రిక ప్రతినిధి మల్లూరు చంద్రశేఖర్ కి చరవాణి ద్వారా తెలిపారు.రేకులు లేచి పోవడంతో ధాన్యం పాడవకుండా పరదాలు కప్పామని అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మొత్తంగా చూస్తే పాడి నష్టం 9.32 కోట్లు అని బిల్డింగ్ నష్టం 02 కోట్లు ఉంటుందని తెలిపారు.ఇట్టి విషయమై గళం ప్రతినిధి మల్లూరు మండల తహశీల్దార్ కు కాల్ చేయగా ది నంబర్ ఇస్ ఔట్ ఆఫ్ నెట్ వర్క్ అని రావడం జరిగింది.తక్షణమే అధికారులు స్పందించి న్యాయం చేయాలని మోర పెట్టుకుంటున్నారు.
Yes it’s true news E69 is best.