సత్తుపల్లి సింగరేణి కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్‌కు నూతన కమిటీ
స్థానిక సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ డ్రైవర్స్ అసోసియేషన్ ఎన్నికలు ఘనంగా నిర్వహించగా, అధ్యక్షుడిగా వల్లెపు ప్రసాదరావు, ఉపాధ్యక్షుడిగా చెట్టిమల్ల అంజని కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత ప్రాంతాల భూనిర్వాసితులకు కాంట్రాక్ట్ పద్ధతిలో వాహనాల నిర్వహణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి డ్రైవర్స్ అసోసియేషన్ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ డ్రైవర్ల జీతభత్యాల పెంపు, సీ.ఎం.పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ వైద్య సదుపాయాలు ప్రతి కార్మికుడికి అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో: సింగరేణి కాంట్రాక్ట్ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, ఉద్యోగులు పాల్గొని నూతన కమిటీ సభ్యులను అభినందించారు