
స్టేషన్‌ఘనపూర్, సెప్టెంబర్ 15 (ఈ69న్యూస్ -తెలుగు గళం):
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్టేషన్‌ఘనపూర్‌లో లయన్స్ క్లబ్, వాసవి వనిత ప్లాటినం క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గన్ను సునీత శ్రీనివాస్, కిరణ్ బుక్‌స్టాల్ వద్ద 200 ఉచిత మట్టి వినాయక విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మనపల్లి అరుణ రవికిరణ్, సెక్రటరీ పులి వినయ్ కుమార్, లయన్ డా. కరుణాకర్, గన్ను జయలలిత, బజ్జూరి రీతిక సాయికుషాల్, గన్ను కార్తీక్ కుమారుడు సాయి అద్వైత్ పాల్గొన్నారు.

అదేవిధంగా వాసవి వనిత ప్లాటినం క్లబ్ ఆధ్వర్యంలో గన్ను సునీత శ్రీనివాస్ ఇంటి వద్ద 500 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు తుమ్మనపల్లి అరుణ రవికిరణ్, సెక్రటరీ గన్ను జయలలిత రమేష్, బజ్జూరి రీతిక సాయికుషాల్, గన్ను కార్తీక్ కుమారుడు సాయి అద్వైత్ పాల్గొన్నారు.
పర్యావరణానికి హాని కలిగించే రసాయన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జై వాసవి.. జై జై వాసవి అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.