
మడికొండ, సెప్టెంబర్ 27 (ఈ69న్యూస్)
హనుమకొండ జిల్లా మడికొండ పరిధిలోని తరాలపల్లిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు శనివారం సీజ్ చేశారు. అల్లం మహేందర్‌కు చెందిన టిప్పర్‌లో మట్టి తరలిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు చేపట్టారు.రైతుల ఫిర్యాదు మేరకు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, కాజీపేట ఆర్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మట్టి తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.మట్టి తవ్వకాలకు సంబంధించి సంబంధిత అనుమతులు ఉన్నాయా? లేక అనుమతులు లేకుండానే మట్టి తరలిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. అలాగే ఎంత మేర మట్టి తవ్వారు, ఎక్కడి నుంచి మట్టి తరలించారు, తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు.అధికారుల విచారణ అనంతరం మట్టి తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.