శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 ( తెలుగు గళం ) న్యూస్,:
చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశ్వరయ్య కాలనీ లో జరుతున్న పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నాల విస్తరణ పనులలో భాగంగా 18 కోట్ల 92 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ సి సి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను ఆర్ సి సి బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం నాల విస్తరణ నిర్మాణం పనులను ఎస్ ఎన్ డి పి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నాలా విస్తరణ పనులను పరిశీలించారు
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఎస్ ఎన్ డి పి ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయలతో అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు చేపట్టడం తో ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా రూ.18 కోట్ల 92 లక్షల రూపాయలతో పటేల్ చెరువు అలుగు నుండి గంగారం చెరువు వరకు నూతనంగా చేపట్టబోయే నాల విస్తరణ పనులను వేగంగా చేయాలని,పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని .ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తీర నుందని విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారని కానీ నేడు సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని,నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని ,నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని ,యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు
నాలల విస్తరణ పనులు తొందరగా చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాలల విస్తరణ పనులు సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రధాన రహదారుల పై పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని , నాలల నిర్మాణం సమయంలో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా లెవల్స్ ను నిర్దారించుకొని పనులు చేపట్టాలని, వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులు వేగంగా పూర్తయ్యేలా చూడలని , వరద ముంపు మళ్ళీ పునరావృతం కాకుండా నాలల విస్తరణ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు
నాలల విస్తరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సలహాలు ,సూచనలు చేశారు
ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ ఆర్ సి సి బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అధికారులకు గాంధీ తెలియచేసారు.
పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనులు పూర్తి అయ్యేలా చూడలని, వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు గాంధీ తెలిపారు
నాలల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ డి పి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డి ఈ శివ సాయి, ఏఈ నిఖిల్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అక్బర్ ఖాన్, చింతకింది రవీందర్ గౌడ్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
