విద్యా ప్రగతికి పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయమే కీలకం!విద్యా ప్రగతికి పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయమే కీలకం!
  • బాలికల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి.. తల్లిదండ్రులతో సమీక్ష!
  • విద్యా ప్రగతికి పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయమే కీలకం!

తెలుగు గళం వెంకటాపురం(నూగూర్), అక్టోబర్ 9:

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల చిరుతపల్లి–2లో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలు, తల్లిదండ్రుల సమావేశం ఉత్సాహంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. ఉష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థినుల విద్యా ప్రగతి, హాజరు, పరీక్షల పనితీరు, భవిష్యత్ విద్యా ప్రణాళికలపై సమీక్షించారు. పాఠశాలలో అందిస్తున్న విద్యా సౌకర్యాలు, భోజన పట్టికతో పాటు ఐదు రకాల క్లబ్బుల ద్వారా విద్యార్థినుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వివిధ నైపుణ్యాలను పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. విద్యార్థినులు చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ప్రధానోపాధ్యాయురాలు కె. ఉష సూచించారు. విద్యా ప్రగతితో పాటు సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజన్‌కుమార్, రామయ్య, శైలజ, సంధ్యారాణి, నవీన్, వీరన్న, రామదాసు, శంకర్ నారాయణ, విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *