: సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేష్
శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 ( తెలుగు గళం ) న్యూస్
దేశ రక్షణ ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ పిలుపునిచ్చారు పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని అమరవీరులకు స్మారక స్థూపం వద్ద ఆయన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు తొలుత గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం అమరుల స్మారక స్తూపానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా సిపి రమేష్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు వారి ధైర్య సాహసాలు దేశభక్తి అంకిత భావం భావితరాలకు మార్గదర్శకమని అన్నారు యూనిఫామ్ ధరించడం గౌరవమైతే ఆ యూనిఫామ్ గౌరవాన్ని కాపాడటం బాధ్యతని దేశం కోసం ప్రాణాలను అర్పించడం అత్యున్నత త్యాగమని పేర్కొన్నారు అమరవీరుల త్యాగం మనకు చరిత్ర వారి ధైర్యం మనకు స్ఫూర్తి అని సిపి కొనియాడారు ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవాలని వారి కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరు సహకరించుకోవాలని సిపి కోరారు అనంతరం సిపి రమేష్ తో పాటు పలువురు అధికారులు సిబ్బంది రక్తదాన శిబిరం ప్రారంభించారు. రక్తదాన శిబిరం అనంతరం రెడ్ క్రాస్ సంస్థకు 87 యూనిట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ కు 73 యూనిట్ల రక్తాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ అడ్మిన్ డిసిపి అన్నపూర్ణ కూకట్పల్లి డిసిపి రితిరాజ్ క్రైమ్ డిసిపి పుష్ప శేరిలింగంపల్లి డిసిపి చింతామణి శ్రీనివాస్ కుత్బుల్లాపూర్ డిసిపి కోటిరెడ్డి ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డిసిపి సృజన సి ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ డిసిపి సంజీవ్ ఇతర ఉన్నత అధికారులు హెడ్ క్వార్టర్స్ సిబ్బంది లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లు ట్రాఫిక్ సిబ్బంది ఆర్ ఐ లు తదితరులు పాల్గొన్నారు
