22/12/2022ఈ 69న్యూస్వరంగల్ **-వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ఇక వాహనాలపై నంబర్ లేకుండా వాహనం నడిపితే వాహనదారుడిపై ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులకు హెచ్చరించారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వాహనదారులను కట్టడి చేయడంతో పాటు చోరీ వాహనాలను గుర్తించడంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వచ్చే జనవరి మొదటి తారీఖు నుండి నంబర్ లేకుండా వాహనం నడిపే వాహనదారులపై ఛీటింగ్ కేసు నమోదు చేయబడుతుందని. అలాగే ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనంపై ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ను ఏర్పాటు, ఉద్యేశపూర్వంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ను మార్పు చేసిన, నంబర్లపై స్టిక్కర్లుగాని, నంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్కులను తగిలించిన, నంబర్ ప్లేట్ను వంచిన వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని. ముఖ్యంగా వాహనాదారులు తమ వాహనాలకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన కూడా వాహనదారులు తమ వాహనాలపై రిజిస్ట్రేషన్ నంబర్ను ఏర్పాటు చేసుకోకుండా వాహనం నడిపిన అలాంటి వాహనదారులపై కూడా ఛీటింగ్ కేసులను నమోదు చేయబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.*-వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము*

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *