120 గ్రామాలకు నీరు ఇస్తానని 80 గ్రామాలకు పూర్తి చేశాను

మిగిలిన గ్రామాలకు కూడా త్వరలోనే కాలువ నీళ్ళు వస్తాయి

రైతులు సహకరించాలి…అభివృద్ధిలో భాగం కావాలి

సీఎం కేసీఆర్ వల్ల కాళేశ్వరం నీళ్ళతో పల్లెలు పచ్ఛగా కళకళలాడుతున్నాయి

చెన్నూరు రిజర్వాయర్ ఆయకట్టు గ్రామాలన్నిటికి సాగు నీరు

కాంట్రాక్టర్ వల్ల పనులు ఆలస్యం…కొత్త కాంట్రాక్టర్ సకాలంలో చేయాలి

లక్ష్మక్క పల్లి మెయిన్ రోడ్ బ్రిడ్జి శంకుస్థాపనలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

(పాలకుర్తి, జనవరి 07)

పాలకుర్తి నియోజకవర్గంa ప్రజలకు ఎన్నికల్లో సాగునీరు, తాగునీరు కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నానని, పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

పాలకుర్తి నియోజకవర్గం లోని లక్ష్మక్క పల్లి గ్రామం వద్ద నేడు మెయిన్ రోడ్డు బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు గారు మాట్లాడారు.

పాలకుర్తి నియోజకవర్గం లోని 120 గ్రామాలకు కాలువ ద్వారా నీళ్లు ఇస్తానని హామీ ఇచ్చానని, అందులో ఇప్పటికే 80 గ్రామాలకు నీరు అందుతుందని చెప్పారు.

మిగిలిన 40 గ్రామాల్లో కొంతమంది కోర్టులకు వెళ్లడం వల్ల, భూమి సమస్యలు ఉండడం వల్ల, కాంట్రాక్టర్లు పనిచేయకపోవడం వల్ల పనులు ఆలస్యం అయ్యాయని, ఇప్పుడు అవన్నీ పరిష్కరించుకొని 40 గ్రామాలకు నీరు ఇచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతోందని, అన్ని గ్రామాలకు కచ్చితంగా నీరు వస్తుందని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అపర భగీరథ ప్రయత్నం వల్ల కాలేశ్వరం నీళ్లు తెలంగాణ గ్రామాలకు చేరి పల్లెలు పచ్చగా పంట పొలాలతో కళకళలాడుతున్నాయని తెలిపారు.

రిజర్వాయర్ నుంచి ఈ నీళ్లను ఆయకట్టు గ్రామాలన్నింటికీ అందించే విధంగా కాల్వపనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇందుకోసం ఆయా గ్రామాల వాళ్లు, రైతులు సహకరించాలని కోరారు.

కొంతమంది కాంట్రాక్టర్లు కావాలని పనిచేయకపోవడం వల్ల, న్యాయపరంగా వారిని వెంటనే తొలగించే అవకాశం లేక అక్కడక్కడ పనులు ఆలస్యం అయ్యాయని చెప్పారు.

ఇప్పుడు ఆ న్యాయ సమస్యలు అన్నిటిని అధిగమించి అధికారులతో సమన్వయం చేసి రైతులను ఒప్పించి గ్రామస్తులను ముందుంచి పనులన్నీ వేగవంతంగా చేస్తున్నట్లు చెప్పారు.

చెన్నూరు కెనాల్ 11 కిలోమీటర్లు కొనసాగుతుందని, దీనిపై 8 బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నామని ఒక్కో బ్రిడ్జికి సుమారుగా 50 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు.

ప్రజల అవసరాలను తీర్చడంలో రైతుల సంక్షేమాన్ని కొనసాగించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా నిధుల కొరత లేకుండా పనులు వేగంగా చేస్తుందని చెప్పారు.

ప్రజలు కూడా గత ప్రభుత్వాలు చేసిన పనులను.. తెలంగాణ వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత జరుగుతున్న అభివృద్ది పనులను సమీక్ష చేసుకుని సీఎం కేసీఆర్ గారికి అండగా నిలబడాలని, అలాంటి నాయకున్ని కాపాడుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రైతులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *