సునీత రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారంసునీత రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ5 February, 2026E69NEWS

6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాలం సునీత రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం

సునీత రవీందర్ రెడ్డి విస్తృత ప్రచారం

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

స్థానిక 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాలం సునీత రవీందర్ రెడ్డి,కార్యకర్తలు నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వార్డులో మురికి కాలువలు నల్ల నీరు కరెంటు పారిశుద్ధ సమస్యలు వివిధ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి వార్డు ప్రజలతో మమేకమై కలిసి పోతానని నాకు సేవ చేసే భాగ్యం కల్పించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు,పార్టీ లో నాకు సహకరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్,కి జిల్లా నాయకులు యుగేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి,యువ నాయకులు అభినవరెడ్డికి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబరీష, మెంచు అశోక్ గౌడ్, కాలం శ్రీనివాస్ రెడ్డి, ఆఫజల్, రమేష్ నాయక్,గుండగని బాబు,ప్రజలు, మహిళలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *