ప్రభుత్వ పాఠశాలలకు నోటుబుక్స్, టేబుల్ పంపిణీ
ఖమ్మంజిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ధాతల సహకారంతో నోటుబుక్స్ పంపిణీ చేశారు. వచ్చానాయక్ తండా, కల్లవాడు, శాంతినగర్, ఖాన్ఖాన్పేట, ఎన్ఎస్పీ పాఠశాల, జీడీపీ పల్లి పాఠశాలలలో ప్రతి విద్యార్థికి ఐదు నోటుబుక్స్ చొప్పున అందజేశారు.
అదేవిధంగా జీడీపీ పల్లి పాఠశాలకు టేబుల్‌ను ప్రధానోపాధ్యాయురాలు శిరీషకు ఎంఈఓ వజీర్ మియా చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న స్ఫూర్తి ఫౌండేషన్ సేవలను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు ఎంఈఓ శ్రీమతి పత్తిపాటి నివేదిత, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శీలం కోటేశ్వరి, ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మర్రెల వెంకటేశ్వర్లు, ఎస్కే ముజీమ్, దేవేందర్, దామల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.