ఎమ్మెల్సీ పోచంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం
పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆత్మకూరు మండల కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రేవూరి జలంధర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజా నాయకుడు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పదవీ కాంక్షతో, రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. తక్షణమే రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఎమ్మెల్సీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో హన్మకొండ జిల్లా ప్రధానకార్యదర్శి కమలాపూర్ రమేష్, మండల యూత్ అధ్యక్షులు తనుగుల సందీప్, మాజీ పి ఎస్సిఎస్ చేర్మెన్ ఎరకొండ రవీందర్, జెపాల్ రెడ్డి, కక్కెర్ల రాజు, ఉడతా రాజేందర్, సర్పంచ్ లు మండల నాయకులు గ్రామా అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు