చాత్రోన్ కి గూంజ్ విద్యార్ధుల సంవాద ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద ఉద్యోగ కల్పనల మీద వ్యవహరిస్తున్న తీరు ను నిరసిస్తూ ఈరోజు ఖమ్మం జిల్లా అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆధ్వర్యంలో విద్యార్థులతో, నిరుద్యోగులతో కలిసి చాత్రోన్ కి గుంజు (విద్యార్థుల సంవాద) కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయం నుండి జెడ్పి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్ధులతో కలిసి వందలాదిమంది కార్యకర్తలతో నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అక్కడికి విచ్చేసిన విద్యార్థి, నిరుద్యోగ యువకులను ఉద్దేశించి దీపక్ చౌదరి మాట్లాడుతూ ఈ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా విద్యార్థుల ప్రవేశ పరీక్షలను సరిగా నిర్వహించక పోగా వారి జీవితాలతో చలగాటమాడుతుంది . లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో బాధిత విద్యార్థుల తో సమావేశాలు నిర్వహించి వారికి అండగా నిలుస్తూ భవిష్యత్తులో ఏ విద్యార్థికి నష్టం జరగకుండా ఉండేవిధంగా పోరాటం చేస్తున్నారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రవేశ పరీక్ష పత్రాలను లీక్ చేసి పది సంవత్సరాలుగా విద్యార్థులు పడుతున్న కష్టానికి ఫలితం లేకుండా చేశారు. ఇది ఆషా మాషి ప్రవేశ పరీక్ష కాదు అహోరాత్రులు నిద్రాహారాలు మానేసి రోజు 18 గంటలు కష్టపడితే గాని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టం అలాంటి ప్రవేశ పరీక్ష పత్రాలను లీక్ చేసి ఈ దేశంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. దీనిపై ప్రతి విద్యార్థి గల మెత్తాలి ఇంతటి దారుణాల కు ఒడిగడుతూ, ప్రవేశ పరీక్షల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నందుకు ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా కొనసాగటానికి వీలులేదని ఈ ప్రభుత్వము గద్దె దిగేంత వరకు కూడా విద్యార్థులు పోరాటం చేయాలని వారికి సంఘీభావంగా మేమంతా కూడా వారి వెంట నడుస్తామని అన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ చాట్రోన్ కి గుంజు పేరిట ఉద్యమాలు చేస్తున్నారో దేశభక్తంగా వారికి సంఘీభావంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు బాసటగా నిలవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థులందరికీ ఒకటే చెబుతున్నాం విద్యార్థులు దేశానికి వెన్నుముక అలాంటి విద్యార్థులకు ఏ నష్టం జరిగినా ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారి ర పక్షాన పోరాటం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, రఘునాధపాలెం మండల పార్టీ అధ్యక్షులు దేవ్ సింగ్ ఆత్మ కమిటీ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు , ఏఎంసీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు అర్బన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలగంగాధర్ తిలక్, సిటీ కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్, ఐఎన్టీయూసీ నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు,మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.