నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ బలవన్మరనానికి నిరసనగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలైన శ్రీ చైతన్య, పాఠశాల NSUI ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బంద్..ఖమ్మం జిల్లా ఎన్ యస్ యు ఐ ఉపాధ్యక్షులు జి.మోహన్ మాట్లాడుతూ NSUI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు శ్రీ చైతన్య , విద్యా సంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది హైద్రాబాద్ లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు సాత్విక్ అనే అబ్బాయిని రక్తం కారేల కొట్టడం మరియు చదవాలి అని ఎక్కువ టార్చర్ చేయడం వలన తట్టుకోలేక క్లాస్ రూంలోనే ఉరి వేసుకొని మరణించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోజిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ సయ్యద్ అసఫ్ అలి చందు తదితరులు పాల్గొన్నారు