అకాల వర్షానికి కూలిన ఇల్లుఅకాల వర్షానికి కూలిన ఇల్లు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కోదాడ పట్టణంలోని 34 వ వార్డులో నివాసం ఉంటున్న సోమపంగు సామ్రాజ్యం ఇంటి పై కప్పు అర్ధరాత్రి కూలింది. శిథిలావస్థలో ఉండి పాత ఇల్లు కావడంతో వర్షానికి నాని ప్రమాదకరంగా ఉండటం ఆ గదిలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ  34వ వార్డు ఇన్చార్జ్ గంధం పాండు రెవెన్యూ అధికారులకు వెంటనే సమాచారం అందించారు. బాధిత ఇల్లును ఆర్. ఐ నగేష్ పరిశీలించి పంచనమ చేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపించి వీలైనంత తొందరలో పరిహారం అందే విధంగా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చీమ శ్రీను, మాజీ వార్డ్ మెంబర్ కుడుముల చిన్న వెంకయ్య, మాజీ ఎంపీటీసీ కాసర్ల సత్యవతి, కలకొండ గోపయ్య, కర్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *