ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్యం పై అవగాహన
ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలని తార్నాక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. బుధవారం ప్రజా ప్రభుత్వం ప్రగతి నివేదన కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ కండక్టర్లతో ఆయన మాట్లాడుతూ వ్యాధులు వాటి నివారణ కు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వ్యక్తి జీవనశైలిలో మార్పులు వ్యాయామం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. మానసిక ఆరోగ్యం రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా ఉద్యోగులకు తెలిపారు. మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండవచ్చునని ఆయన సందర్భంగా అన్నారు. అత్యవసర పరిస్థితులలో సిపిఆర్ చేసే విధానం ఆయన ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు ఉద్యోగ సమయంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించి ప్రమాదాల నుండి దూరంగా ఉండవచ్చునని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండటం వలన తన కుటుంబానికి అదేవిధంగా సంస్థకు మార్గదర్శిగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్ కండక్టర్లకు మరియు హైర్ బస్ డ్రైవర్లకు బిపి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ ఎస్ సాహితి, హెల్త్ వాలంటీర్ నాగభూషణం, వెల్ఫేర్ కమిటీ సభ్యులు సైదిరెడ్డి, ఏడీసీలు, సూపర్వైజర్లు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
