దూప తండాలో విషాదం
పర్వతగిరి మండలం అన్నారం దూప తండా గ్రామానికి చెందిన గుగులోతు కొమ్మాలు ఆకస్మికంగా మృతి చెందారు.విషయం తెలుసుకున్న పర్వతగిరి సొసైటీ చైర్మన్ యం. మనోజ్ గౌడ్ శుక్రవారం వరంగల్ ఎంజీఎం మార్చురీకి వెళ్లి కొమ్మాలు పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో దూప తండా మాజీ సర్పంచి దూల్యా నాయక్, మాజీ ఉప సర్పంచ్ మెగ్య, శంకర్ తదితర నాయకులు పాల్గొని మృతుడికి సంతాపం తెలిపారు.