ఈ69న్యూస్ హన్మకొండ
మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచరణీయమని జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ అన్నారు.ఏప్రిల్`11 శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు.ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు.సామాజిక కార్యకర్తగా,వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘసంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శమని అన్నారు.సమాజంలో వివక్షకు తావు లేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహానీయుడని కొనియాడారు
వెనుకోబడిన వర్గాల,దళిత జనార్ధనకు ఆయన ఎంచుకున్న బాట,అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్‌ను కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.పూలే స్ఫూర్తితోనే విద్య ఉపాధి అవకాశాలకు అన్ని వర్గాల వారికి అందించే విధంగా బీసీల రిజర్వేషన్ అంతేకాకుండా మహిళా సాధన సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను ప్రవేశపెట్టింది అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రామ్ రెడ్డి ఆర్డీవో రమేష్ రాథోడ్,గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్,బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్,రజక సంఘం జిల్లా అధ్యక్షులు సాంబరాజు,బిక్షపతి,వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లెపు సమ్మయ్య,బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మెల శోభారాణి,మాడిశెట్టి అరుంధతి,జిల్లా వీర శైవ లింగాత సంక్షేమ సంఘం ప్రతినిధు జివిజిమౌళి వీరస్వామి శైలేష్,లెక్చరర్ ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆసనాల శ్రీనివాస్,పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ చందా మల్లయ్య,బీసీ జేఏసీ జిల్లా కన్వీనర్ క్రాంతి కుమార్,జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్యామ్ యాదవ్,విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి ఇతర జిల్లా అధికారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.