అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన గ్రామ సర్పంచ్
మరిపెడ మండలం, గిరిపురం గ్రామం లోని అంగనవాడి -2 కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాదావత్ నీలా సైదులు, సూపర్వైజర్ రాణి, కార్యదర్శి లావణ్య కలిసి తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, హాజరు నమోదు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు విద్యా కార్యక్రమాలు వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు అందుతుందనే అంశాన్ని పరిశీలించారు.మరింత మెరుగుదలకు అవసరమైన సూచనలు చేశారు. పిల్లల ఆరోగ్యం మరియు అభివృద్ధి విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పట్ల రాధ, సిబ్బంది ఉమా,మాజీ ఉపసర్పంచ్ సుమలత,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు