అందరికి ఆదర్శప్రాయుడు మంచికంటి : నున్నా నాగేశ్వరావు
కమ్యూనిస్టులందరికి ఆదర్శప్రాయుడు మంచికంటి రాంకిషన్రావు అని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు కొనియాడారు.
స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయం, సుందరయ్య భవన్ నందు ఆదివారం అమరజీవి కామ్రేడ్ మంచికంటి రాంకిషన్రావు 31వ వర్ధంతి సభ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, మంచికంటి రాంకిషన్రావు చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు.
అనంతరం నున్నా మాట్లాడుతూ మంచికంటి నిబద్దత, ధైర్యం కలిగిన వ్యక్తి అని, ఎన్నో ఆటంకాలు వచ్చినా పార్టీ కోసం తుది వరకు పోరాడిన వ్యక్తి అని, సైద్ధాంతిక నిబద్దత, మిలిటెన్సీ పోరాట పటిమ కలిగినవాడన్నారు. చీలిక సమయంలోనూ మార్క్సిజం, లెనినిజాన్ని అమలు జరిపిన నిజమైన కమ్యూనిస్టు అన్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలోనూ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా దళాలు నడిపి పేద ప్రజలను, దొర గడీల నుండి విముక్తి చేసిన గొప్ప పోరాట ధీశాలి అని అన్నారు. నాడు కమ్యూనిస్టు ఉద్యమంపై కాంగ్రెస్ దాడులు జరుగుతున్నా ఎదురొడ్డి ముందు నిల్చి పోరాడిన గొప్ప యోధుడన్నారు. పార్టీ నిర్ణయం చేసిన వెంటనే తనకు ఉన్న 600 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన ప్రజా నాయకుడని, భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల పక్షాన చివరి వరకు పోరాడిన వ్యక్తి అన్నారు. శాసన సభ్యునిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం శానససభలోనూ, ప్రభుత్వంపై పోరాడిన వ్యక్తి అన్నారు. ఖమ్మం జిల్లా సిపిఐ(యం) ఉద్యమ నిర్మాతలలో ఒకరైన మంచి కంటి జీవితం అందరికీ ఆదర్శప్రాయం
అలాంటి కామ్రేడ్ స్ఫూర్తితో పార్టీపై విశ్వాసాన్ని ఉంచి ప్రజా సమస్యలపై మరింత ఉద్యమించాలన్నారు.
ఈ సభలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారు రమేష్, సీనియర్ నాయకులు యం. సుబ్బారావు, టి.ఎల్. నరసయ్య నాదెండ్ల శ్రీనివాస్, నెల్లూరు వీరబాబు, పగడాల నాగేశ్వరరావు, డాక్టర్ భారవి, బోడపట్ల రవీంద్ర, రఫీ,నాగేశ్వరరావు పుల్లారావు తదితరులు
నాయకులు పాల్గొన్నారు