
ఈ69న్యూస్ హన్మకొండ:పచ్చిమ నియోజకవర్గ పరిధిలోని రాంనగర్,కడిపికొండ,ఖాజీపేట ప్రాంతానికి చెందిన షబానా బానుకి అంబలికల్ హెర్నియా సమస్య ఉండటంతో హన్మకొండ బాలసముద్రంలోని వాసవి నర్సింగ్ హోంలో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.ఈ చికిత్సకు సుమారు రూ.57,000/- ఖర్చవడంతో బాధితురాలి ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని,స్ట్రీట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ టీం ఇంచార్జ్ సయ్యద్ సలీం నేతృత్వంలో పచ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ద్వారా సీఎం సహాయ నిధిలో (CMRF) ఆర్థిక సహాయానికి దరఖాస్తు సమర్పించబడింది.బాధిత కుటుంబానికి ఈ సహాయం ఉపయోగపడేలా అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.