అమెరికా సామ్రాజ్యవాద కుట్రను తిప్పి కొట్టాలి సీఐటీయూ
అమెరికా ప్రపంచంలోని సహజ వనరులు, ముడిచమురు నిల్వలుఎక్కడ వున్నా వాటిపై పెత్తనం కోసమే బరితెగించి సైనిక చర్యలకు ఆదేశాలపై దిగతోందని దానిలో బాగమే ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా దాడికి పూనుకున్నదని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. మంగళవారం అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేటలోని సిఐటియు కార్యాలయంలో రామకృష్ణ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జున్ మాట్లాడుతూ అనేక యుద్దాలను నివారించే తనకు శాంతి బహుమతి ఇవ్వలేదని అలిగిన ట్రంప్ నిజస్వరూపం ఇరాన్ అధినేత ఖమేని నీ అత్యంత కుట్రపూరితంగా హత్య చేయటంలోనూ వెనుజులా దేశ అధ్యక్షుడు మధురోను ఆయన భార్యను అమెరికాలో నిర్బంధించటం లో బహిర్గతం అయిందని అన్నారు. అమెరికా ప్రపంచ దేశాలపై బందిపోటు దొంగల్లాగా ఆయా దేశాల నాయకత్వాన్ని ప్రజలను చంపి ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేస్తూ దేశాల లొంగదీసుకుంటుందని అన్నారు. ఇందులో భాగమే ఇరాన్ పై దాడికి తెగబడిందని అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను పౌర సమాజం వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు విజయలక్ష్మి సత్యవతి యశోద సత్యవేణి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.