
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
ఆరె కులాల హక్కుల సాధన కోసం చేపట్టిన 30 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆరెకుల బంధువులు అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆరెకుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు బూర్గుల ప్రముదాదేవి పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షురాలు బూర్గుల ప్రమదాదేవి ఈ మేరకు శుక్రవారం మండలంలో పర్యటిస్తూ ఆరె బంధువులను కుటుంబ సభ్యులను కలిసి ఢిల్లీ పర్యటనకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని ల నుంచి ఆరెకుల ఓ బి సి సర్టిఫికెట్ లేక కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలకు నోచుకోలేక పోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐఐటి, రైల్వే, విద్యా అవకాశాలను కోల్పోతున్న నేపథ్యంలో ఆరాకుల సాధన కోసం ఈనెల 30న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో సాయంత్రం 4 గంటలకు.. ఆరె కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్తుకు.. ఓ బి సి అవగాహన – సెమినార్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు.చలో ఢిల్లీ కార్యక్రమా విజయవంతం ప్రతి ఆరె కుటుంబం నుంచి ఒకరి చొప్పున వందలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షురాలు ప్రమదాదేవి కోరారు.ఈ కార్యక్రమానికి 28 కుల సంఘాలతో,10 మంది పార్లమెంటు సభ్యులు,కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రివర్యులు డా. వీరేంద్ర కుమార్ పాల్గొంటారని,ఇది మన కులంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఆరే కుల సభ్యులు కుటుంబ సభ్యులు బాధ్యతతో తరలివచ్చి సమస్య సాధనకు కృషి చేయాలని కోరారు. ఓబీసీ సాధిస్తే భవిష్యత్ తరాలు ఎంతో ఉపయోగ పడుతుందని ప్రమదాదేవి కోరుతూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తరలివచ్చే ఆరె బంధువులు జిల్లా అధ్యక్షుడికి సమాచారం ఇచ్చి, రైల్ టికెట్స్ బుక్ చేసుకుని 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఢిల్లీలో ఉండేలా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.