ఇండియన్ బ్యాంక్ మేనేజర్ బాల బదిలీ
హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలం పంతిని గ్రామంలో గల ఇండియన్ బ్యాంక్ లో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న బాలా కు కృష్ణాజిల్లాలోని బందర్ సమీపంలోని కోసూరు బ్రాంచ్ కి బదిలీ చేస్తూ హైదరాబాద్ (ఆంధ్ర తెలంగాణ) ఫీల్డ్ జనరల్ మేనేజర్ కార్యాలయం నుండి గురువారం ఉత్తర్వులు అందినట్లు మేనేజర్ బాల తెలిపారు. మేనేజర్ బాల శుక్రవారం విధుల నుండి రిలీవ్ అవుతున్నట్లు సమాచారం అందుకున్న వరంగల్ జిల్లాలోని పర్వతగిరి వర్ధన్నపేట, హన్మకొండ జిల్లాలోని ఐనవోలు మండలాల సెర్ప్ ఉద్యోగులు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, వివో ఏలు పంతిని గ్రామానికి చేరుకొని మేనేజర్ బాలాకు ఆత్మీయ వీడుకోలు సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా పూలబోకినందించి పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సిసి గోలి కొమురయ్య మాట్లాడుతూ… బాల మేనేజర్ గా 3 సంవత్సరాలలో కాలంలో బ్యాంకు ఖాతాదారులకు స్వయం సహాయక బృందాలకు సభ్యులతో మమేకమై ఎనలేని సేవలు అందించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. మేనేజర్ బాల చేసిన సేవలకు పంతిని బ్రాంచ్ కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పురస్కారం లభించిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏపీఎం సురేష్, సీసీ ధనుంజయ, వివో లీడర్లు మడూరు జ్యోతి సట్ల లక్ష్మీ భవాని ఫరీదా బేగం వివోఏలు కోదాటి మంజుల సంతోష, సంధ్య రాజయ్య జ్యోతి వివో ల కార్యనిర్వాహక సభ్యులు మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు