
ఈ69న్యూస్ హనుమకొండ: ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపికలో తప్పనిసరిగా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సమావేశంలో చేయూత పింఛన్లు,రాజీవ్ యువ వికాసం,తాగునీటి సరఫరా,ఇందిరమ్మ ఇండ్ల పథకంపై సమీక్ష జరిగింది.అర్హుల ఎంపికను ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో జరిపించాలని,మే 2న లబ్ధిదారుల జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని,అవసరమైతే చేతిపంపుల మరమ్మతులు చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం,గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను,హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.