Citizens may reach out to the following helpline contacts for any support or information:
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు,విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.
🔸విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి అందిన తాజా వివరాల ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడమైనది.
🔸గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
🔸సహాయం అవసరమైన వారు ఈ కింది నెంబర్లను సంప్రదించవచ్చు
▪️శ్రీమతి వందన,పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్: +91 9871999044
▪️శ్రీ జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్: +91 9643723157
▪️శ్రీ జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్: +91 9910014749
▪️శ్రీ సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి: +91 9949351270