ఎరుకల వర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది:రాయపురం సాంబయ్య
ఈ69న్యూస్ హైదరాబాద్: ఎరుకల సామాజిక వర్గానికి ప్రభుత్వాలు, పార్టీలు అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ ఎస్టి సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య అన్నారు.హైదరాబాద్లో జరిగిన ఎరుకల అలై బలై” సభలో మాట్లాడుతూ..తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన ఎరుకల వర్గానికి ఒక ఎంపీ,ఎమ్మెల్యే అవకాశం కూడా ఇవ్వకపోవడం దారుణం,అని విమర్శించారు.గిరిజన రిజర్వేషన్లలో కొన్ని కులాలకే అవకాశాలు వస్తున్నాయని,అసలైన న్యాయం ఎరుకల వర్గానికి జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.