ఎస్ఎస్టి చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
పున్నేలు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీం
(ఎస్ఎస్టి)చెక్‌పోస్ట్‌ను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఎన్నికల నిబంధనల అమలు,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పాటింపు,వాహనాల తనిఖీలు సమర్థవంతంగా జరుగుతున్నాయా అనే విషయాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.చెక్‌పోస్ట్ వద్ద నమోదైన రికార్డులను పరిశీలించిన కలెక్టర్,ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని,రోజువారీ ఎన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ప్రత్యేకంగా అనుమానాస్పద వాహనాల రవాణాపై అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు,మద్యం,ఇతర నిషేధిత వస్తువుల రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,ప్రతి వాహనాన్ని నిఖార్సుగా తనిఖీ చేయాలని ఆదేశించారు.ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా,నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు.ఈ తనిఖీ సందర్భంగా సంబంధిత అధికారులు,సిబ్బంది కలెక్టర్‌కు చెక్‌పోస్ట్ పనితీరుపై వివరాలను అందించారు.