ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి
రిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు మరియు బాలబాలికలకు చదువుతోపాటు వసతి సౌకర్యాలు విషయంలో
సంబంధిత హెచ్ఎం, వార్డెన్లు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని అలాగే ఉద్దీపకం వర్క్ బుక్ టు లోని అంశాలు ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు దుమ్ముగూడెం మండలం లోని గిరిజన సంక్షేమ నారాయణరావుపేట బాలురు మరియు మంగువాయి బడువ బాలికల ఆశ్రమ పాఠశాలలు మరియు గంగారం, ఆదర్శనగర్ జిపిఎస్ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మంగువాయి బడవ, నారాయణరావుపేట ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను పరిశీలించి జరుగుతున్న పనులు నాణ్యతగా ఉండేలా చేయాలని సంబంధిత ఇంజనీర్లకు ఆదేశిస్తూ, హెచ్ఎంలు దగ్గర ఉండి మీకు నచ్చిన విధంగా పనులు చేయించుకోవాలని అన్నారు.
ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల బాధ్యత రహితంగా విధులు నిర్వహిస్తూ పై అధికారుల ముందస్తు అనుమతి తీసుకోకుండా సెలవుపై వెళ్లిన నారాయణరావుపేట ఏ హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ కు సోకాజ్ నోటీసులు జారీ చేసి హెచ్ఎం బాధ్యతల నుండి తప్పించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి అశోక్ కు ఆదేశించారు. అనంతరం మంగువాయి బడవ గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో కలిసి భోజనాలు చేసి ప్రతిరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నది లేనిది విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సమయానుకూలంగా మెనూ ప్రకారం విద్యార్థినీ విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారము అందించాలని, వంట చేసిన తర్వాత ముందుగా హెచ్ఎం వార్డెన్ సిబ్బంది తిన్న తర్వాతనే విద్యార్థినీ విద్యార్థులకు వడ్డించాలని, ప్రతి నెల రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం తప్పనిసరిగా కెరీర్ గైడెన్స్ పై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎం లకు సూచించారు. అనంతరం గంగారం జిపిఎస్ పాఠశాలలను సందర్శించి ఉద్దీపకం వర్క్ బుక్ సంబంధించిన అంశాలు పిల్లల చేత బోర్డుపై వ్రాయించి వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల ద్వారా అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదర్శనగర్ జిపిఎస్ పాఠశాలల్లో సంబంధిత టీచర్ ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారం రోజుల్లో తప్పనిసరిగా ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ప్రతి పిల్లవానికి అర్థమయ్యే రీతిలో బోధించి పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ తప్పనిసరిగా వచ్చేలా చూడాలని, సంబంధిత ఎస్సిఆర్పి వారానికి రెండు రోజులు ఆదర్శనగర్ పాఠశాలల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు పిల్లలు గనుక సరిగా అర్థం చేసుకొని చెప్పలేని పక్షంలో తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ సి ఆర్ పి కి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నారాయణరావుపేట ఇన్చార్జి హెచ్ఎం బాలాజీ, మంగువాయి బడవ హెచ్ఎం వీరమ్మ, జిపిఎస్ పాఠశాలల ఉపాధ్యాయులు లక్ష్మీ, నిర్మల మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు