
ఒంటిమామిడిపల్లి పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
ఈ69న్యూస్: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో నర్సరీ నుంచి యూకేజీ వరకు పూర్తి చేసిన విద్యార్థుల కోసం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో పులి ఆనందం చిన్నతనం నుంచే బలమైన విద్యా పునాది అవసరమన్నారు.విద్యార్థులు రంగురంగుల గౌన్లు ధరించి పట్టాలను అందుకున్నారు.తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారుల ఆనందం మురిపించింది.ప్రధానోపాధ్యాయులు మంద సదానందం మాట్లాడుతూ,ఇటువంటి కార్యక్రమాలు పాఠశాల-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.