ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి ఘనపురం
ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్.ఐ.ఆర్) ప్రక్రియ ఓటర్ల జాబితా ప్రక్షాళనలో అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు నమోదయ్యేలా, అలాగే అనర్హుల పేర్లను పారదర్శకంగా తొలగించేలా ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ సవరణ ప్రక్రియపై పార్టీ కార్యకర్తలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో జరుగుతున్న సవరణ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఓటర్లకు అవసరమైన సహాయాన్ని అందించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.అనంతరం నిషీధర్ రెడ్డి మండల తహశీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.మండల వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ పురోగతి,అందుతున్న దరఖాస్తులు,ఎదురవుతున్న అంశాలపై తహశీల్దార్‌తో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత ఘనపురం మండల కేంద్రంలోని 141వ పోలింగ్ బూత్‌ను స్వయంగా సందర్శించి,అక్కడ విధులు నిర్వహిస్తున్న బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఓ) ఆలూరి కోమల నుంచి వివరాలు సేకరించారు.బూత్ స్థాయిలో దరఖాస్తుల స్వీకరణ,పరిశీలన విధానం,ప్రజలకు అందిస్తున్న సేవల తీరును ప్రత్యక్షంగా పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఘనపురం మండల ఇన్చార్జి శివనాత్రి వేణు,దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య,బి.జె.వై.ఎమ్ రాష్ట్ర నాయకులు మంద మహేష్,మండల సీనియర్ నాయకులు బొదుల మొగిలి,మాడిశెట్టి సాంబశివుడు,గొర్రె రవి,చెలుమల్ల ప్రవీణ్ కుమార్,141వ బూత్ అధ్యక్షుడు పెండ్యాల శ్రీకాంత్,యువ నాయకుడు జన్నే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.