కాంగ్రెస్ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి
సత్తుపల్లి మున్సిపాలిటీ 23 వార్డుల సభ్యుల నామినేషన్ దాఖలు మొదలైన నేపథ్యంలో.నువ్వా, నేనా, ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎలక్షన్ అధికారుల పర్యవేక్షణలో, కొనసాగుతున్న నామినేషన్ దాఖల సందడి కొనసాగుతుంది.ఈ సందర్భంగా.సత్తుపల్లిలోని 23వార్డులు నామినేషన్ నేపథ్యంలో గురువారం 22 వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎండి కమల్ పాష సతీమణి ఎండి రెహనా బేగం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 22 వ వార్డుకు పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చిన శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్,లకు మా కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ పథకాలు చూసి ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నామని తెలియజేశారు.