
ఈ69న్యూస్:-హన్మకొండ ధర్మసాగర్ మండలంలోని కాష్గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ శాఖ అధ్యక్షుడు హఫీజ్ నేతృత్వంలో గ్రామస్తులు ఐదు ట్రాక్టర్లు,50 బైకులతో ర్యాలీ నిర్వహించి రజతోత్సవ సభకు బయలు దేరడం జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ, “బీఆర్ఎస్ హయాంలో గ్రామాభివృద్ధి జరుగగా, ప్రస్తుతం ప్రభుత్వం మాటలకే పరిమితమైందని” విమర్శించారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సయ్యద్ కలీం ఇమాంబి,మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ ఇమామ్,ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.