టీసీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. డేవిడ్ సుదర్శనం..
టీసీసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. డేవిడ్ సుదర్శనం..
సమాజంలో క్రైస్తవ పాస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషఫ్ ఎం. డేవిడ్ సుదర్శనం కోరారు. మంగళవారం కల్లూరులో ఆ సంఘం డివిజన్ స్థాయి సమావేశం పాస్టర్ రత్నాకర్, సుజాత సహకారంతో యుఏఎం చర్చిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శనం మాట్లాడుతూ క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమం పథకాలు, స్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్, తదితర పథకాలను అర్హులైన పాస్టర్లకు అందించాలని కోరారు. అనంతరం ఆయనతోపాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం కిరణ్ కుమార్ చేతుల మీదుగా పాస్టర్లకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీసీసీ బాధ్యులు దేవమందిరం, రాష్ట్ర సలహాదారు నిరీక్షణ రావు, రాష్ట్ర కన్వీనర్ డేవిడ్ పాల్, ఇస్సాకు, పేతురు తదితరులు పాల్గొన్నారు.