
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో గవర్నమెంట్ ప్లిడర్ గా నియమించబడిన బోట్ల సుధాకర్ ని మర్యాదపూర్వకంగా టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి డబ్బేట రమేష్ ఆధ్వర్యంలో కలిసి షాల్వతో సత్కారంచడం జరిగింది.ఈ సందర్బంగా డబ్బేటా రమేష్ మాట్లాడుతు సుధాకర్ దళిత జాతిలో పుట్టి పెరిగినందుకు,ఆ జాతికి వన్నెతెచ్చినందుకు గర్విస్తున్నామని అన్నారు.
అంతేకాకుండ భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. దళితులను గిరిజనులను గుర్తించి వారికి సముచితస్థానం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నత్తి కార్నల్, రాజేష్ ఖన్నా, గంజి లక్ష్మణ్, కొలేపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.