ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు
ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు
భద్రాచలం, జూన్ 13 (తెలుగు గళం న్యూస్)
భద్రాచలం ఐటిడీఏ ఆధ్వర్యంలోని వైటీసీ శిక్షణా కేంద్రంలో గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. 18 నుండి 33 సంవత్సరాల వయస్సు గల ఎస్టీ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ప్రస్తుతం కంప్యూటర్ కోర్సులో ఒక బ్యాచ్, బ్యూటీషియన్ కోర్సులో రెండు బ్యాచ్లకు మాత్రమే సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఆసక్తి గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 20వ తేదీలోగా తమ సామగ్రితో నేరుగా వైటీసీ శిక్షణా కేంద్రానికి చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతులు ప్రారంభమవుతాయని ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి పేర్కొన్నారు.